ఋతురాగాలు సీరియల్ లో నటించిన రూప దేవి అలియాస్ శారద అంటే చాలు ఎవ్వరికైనా గుర్తొచ్చేస్తుంది. అసలు ఈ సీరియల్ ఇప్పుడు టెలికాస్ట్ ఐనా కూడా చూడని వారంటూ ఎవరూ ఉండరు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ లవ్ స్టోరీ. ఇక రూపాదేవి నటన గురించి చెప్పాలంటే పీక్స్..ఎక్కువ తక్కువ కాకుండా మొత్తం బాలన్స్ గా నటిస్తారు. అలాంటి రూపాదేవి మహానటి సావిత్రి గారి గురించి కొన్ని కామెంట్స్ చేసారు. " మహానటి సావిత్రి గారు రియల్ లైఫ్ లో ఎప్పుడూ దర్పం చూపించుకునే వారు కాదు. ఎవరం వెళ్లి మాట్లాడినా కూడా మరీ ఎక్కువగా కాదు తక్కువగా కాదు బ్యాలన్సుడ్ గా మాట్లాడేవారు.
బాలకృష్ణ నటించిన ప్రేమ - పగ అనే మూవీలో నేను సావిత్రి గారితో కలిసి ఒక సీన్ చేశా. కానీ అప్పటికే ఆమె ఇండస్ట్రీలో మాలాంటి వారందరికీ ఒక చాఫ్టర్ లాంటి వారు. అప్పటికే ఆమె ఆరోగ్య పరంగా చాలా పాడైపోయారు. ఐతే తమిళ్ లో ఋతురాగాలు చేస్తున్నప్పుడు ఆమె మంచం పట్టారు. నేను ఒక రోజు చూడడానికి వెళ్లాను. అప్పుడు జెమినీ గణేశన్ గారు అక్కడే ఉన్నారు. ప్రేమ - పగ మూవీ అప్పట్లో పెద్ద హిట్. నా క్యారెక్టర్ కి కూడా మంచి పేరు వచ్చింది. నేను వెళ్ళినప్పుడు సావిత్రి గారికి నేనొచ్చిన విషయాన్నీ చెప్పారు. కానీ ఆమె కోమాలో ఉన్నారు. అంత భారీ ఖాయంతో ఎంతో అందంగా కళ్ళతో నటించే సావిత్రి గారు చిన్న పిల్లలా మారి మంచం మీద ఉండడం చూసాక నాకు చాలా బాధగా అనిపించింది. ఆమె కాళ్లకు దణ్ణం పెట్టుకుని ఇంటికి వచ్చి బాధపడ్డాను, నాకు ఏడుపాగలేదు. ఇప్పుడు డయాబెటిక్ పేషంట్స్ కి అవేర్నెస్ అనేది ఉంది కానీ అప్పట్లో అంతగా తెలీదు. ఆ తర్వాత సావిత్రి గారు ఒక రెండు నెలల తర్వాత పోయారు. చివరి రోజుల్లో జెమినీ గణేష్ గారు చూసుకున్నారు. మహానటి మూవీలో చూపించిన ఒక మీడియం హౌస్ లోనే ఆమె ఉన్నారు. అసలు ఆవిడ చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉండేవారు. పాపం అని పిలిచి ఆ రోల్ ఇచ్చినట్టు ఉన్నారు ఆ సినిమాలో. సెట్ లో ఎంతమంది కొత్తవాళ్లు ఉన్నా కూడా ఆవిడ తన పని తానూ చూసుకునేవారు. మేమంతా వెళ్లి ఆమె బ్లేసింగ్స్ తీసుకునేవాళ్ళం. సెట్ అందరితో చాలా బాగుండేవాళ్లు. మరీ ఓవర్ ఫ్రెండ్లిగా లేరు అలాగని మాట్లాడకుండా కూడా ఉండరు. నేనొక పెద్ద హీరోయిన్ అనే గర్వం కూడా ఆమెకు ఉండేది కాదు. " అని చెప్పుకొచ్చింది.